'అమ్మ ధర్మం,బాబు ధర్మం'
:వొంటి పాదం కుంటుతు ధర్మం నడిచే కాలం,
'చెయ్యండమ్మా ధర్మం.'
:కలియుగ ధర్మం ఇంతే లేరా....
'చెయ్యండమ్మ చిన్న సహాయం.'
"పిదికెతొ పట్టెదు బియ్యం పడెయ్."
ఇదేనా అమ్మా! భేషైన కార్యం???
ఆత్మ గౌరవం తెగనరికి,
సిగ్గులజ్జలని బూడిద జేసి,
మన వాకిట నిలిచి చేజాచిరి.
ముష్ఠి గీతం అందుకొంటిరి.
చిప్ప చేత బట్టి,చిరుగు బట్ట తొడిగి,
మన వాకిట నించున్న ఆ నల్ల సూరిడు కలిసి నాతో ఈ భూమికి వచ్చాడు.
డబ్బు సంగతి తెలియని ఆ వెర్రి పిచ్చోడు,తెలియక ఆ ముష్ఠి ఇంట పడ్డాడు.
ముష్ఠికి మహ రాజుకి దూరం ఇలా ఉండేనా,అమ్మా??
ఐతే మరు జన్మ లొ నే కూడా ముష్ఠి గీథం పాడవలసిందేనా అమ్మా!!!
Wednesday, January 03, 2007
Subscribe to:
Posts (Atom)