Thursday, May 24, 2007

గాంధీ బాటన గొఱ్ఱెను కాను.....

బురద కూపం ఈ సమాజం లో
యంత్రపు నీడలొ,
కష్టం తెలియక
నడుం కదల్చక,
చక్రాలతో బతుకును నడిపే ఈ రోజులలో
గాంధీ బాటన గొర్రెను కాను...

రోజుకో రేపు
రోజూ ఓ పేచీ.
సైబర్ క్రైములు,సెక్సు స్క్యాములు
భూ కబ్జాలు, బడా కుంభకోనాలు
నేటి మనిషి పురోగతికి పగల బడి నవ్వడా..మహాత్ముడు!!!
మానవత మట్టి లో...మనుషులు,అథః పాతాళం లో
మనిషి మనిషికి దూరం తగ్గె....మనసుకి మనసుకి దూర పెరిగె..
గాంధీ దేశం కలల్లోనే బతికే...

మానవత అహింసలు కరువైన నా దేశం లో...
గాంధీ బాటన గొఱ్ఱెను కాను.....

నవ సమాజం....

నవ సమాజం వర్ధిల్లాలి,నవ సమాజం వర్ధిల్లాలి
మనిషి మనుగడ వర్ధిల్లాలి,మానవ సమాజం వర్ధిల్లాలి
కాసుల గలగల కళ్ళ ముందు మెదలాలి,మన ఇంటి సౌభాగ్యం మిల మిల మెరవాలి.
నవ సమాజం వర్ధిల్లాలి,నవ సమాజం వర్ధిల్లాలి.

గంధీ మాటలు బట్టి లో పోసారు.అవును మీరు కాక ఇంకెవరు చేసారు??
ఆయన చేతలు చరిత్రలై పోయాయి, మాటలు మట్టి లో కలిసాయి
గంధీ అడుగుల అడుగు వేసిన భారతం ఏది? కట్టలు తెంచుకున్న దేశ భక్తి ఏది ??
'నేనూ,'నా' తప్ప అర్థమెరుగని సమాజం......నవ సమాజం వర్ధిల్లాలి.

ముష్ఠి బ్రతుకుల బడా బాబులు, లంచ గొండులు,దగా కోరులు
గుండెలు కాల్చి,బ్రతుకులు మాడ్చి...రక్తం పీల్చీ రఖ్ఖశి వీరులు.
సందు దొరికితే లంచం,సంతకానికో లఖారం.
నాయక లోకం వర్ధిల్లాలి,నవ సమాజం వర్ధిల్లాలి.

ముందు తరాలకు సాక్షాన్నవుతా,మన తరం వేషాలు విప్ప దీసి చెప్తా
మన సమాజం కల్మష క్రియలు గుర్తుండేలా ప్రతిధ్వనిస్తా. కుళ్ళు గుండెల కుప్ప తొట్టెల మనసుల మనుషుల ఈ సమాజం లో,
మంచి మనిషికి చోటెక్కడ? తోటి మానవునికి తోడెక్కడ??ఐనా కూడా...
నవ సమాజం వర్ధిల్లాలి,నవ సమాజం వర్ధిల్లాలి.

తమ తండ్రులు, తమ తాతలను తిట్టి పోస్తే ముందు తరం ,
అపుడు చచ్చి బూడిదైన మనకి బుధ్ధొస్తుందా???
సెవాలైన మనకి సిగ్గొస్తుందా??? ఐనా.....
నవ సమాజం వర్ధిల్లలి,నవ సమాజం వర్ధిల్లలి.