Tuesday, July 31, 2007

వరకట్నం

వరకట్నం వలలో వెఱ్ఱి వ్యవస్థ
చాలవా మయలాడి చేసిన మంత్రపు జిత్తులు?
ఆగవా ఇంతింత అగ్ని ప్రమాదాలు?
మానరా మానవాళి సిగ్గు పదే పనులు??
కాల కూట విషం కరునించేదెప్పుడు?
అక్కల ప్రనాలకు భద్రత ఇంకెప్పుడు??
చివాట్ల చక్రం
పెట్టు వాతలు తన కొంగుతొ కప్పేస్తూ
సాగించే జీవనం,మన అక్కల కాపురం.

సుందరి..

నీలాల తన కన్నులు నిండార చూడనీదు
తమకాల తన పెదవులు తెదిపార తాక నీదు
చేయి వేస్తే షట్ అప్..ముద్దడిగితే బుల్షిట్
ఆడువారు కడు ముద్దు గుమ్మలు..మనసులు మాత్రం మహా కాంప్లెక్స్

దున్నపోతు

"యదవ, యదవున్నర యెదవ.
పేపర్లో పెద్ద బొక్క!!
మారవా నువ్వెంతకీ ఇంకో పక్క,
మార్కుల దానం ఆపరా యెదవ
గ్రేడు కోసం పాటు పడరా పనికి రాని మొదవ."

పనికి రాని ఎద్దు పని చెయ్యదు బాబూ...
చదువు పేరు చెప్పి నన్ను కదిలించ లేరు బాసు...
స్లీపు త్యాగం జేసి,చదువ పుస్తకం బట్టాలా???
దున్న పోతు మీద వర్షం దులిపేస్తే పోదా????

డైరెక్టర్

నిండు జాబిలి,
పసిడి వెన్నెల
జిలిబిలి తారలు,
సరసన సుందరి
దూరాన సాగర అంబర సంగమం
దగ్గరగ నెచ్చెలి యవ్వనం
ఇన్నింటిని ఒక మాటున నాకు ఇచిన ఆ దర్శకుని నెర్పరి తనం
కవికందని కావ్యం
రవికందని కమలం.

గాలిపటం

యెడారి దారిన వంటరి నడకన,
తీగ తెగిన గాలిపటం నేను.
తీరు తెన్ను లేక, తగిన పద్ధతి లేక
వంటరిని నేను.
బాటసారిని నేను.
గాలెటు వీస్తే అటూగిపోతా
గాలి లేని వేళ నిట్టుర్చి భువికొరిగి పోతా.

భూమిని చేరితి పతంగం నేను
పెట్టండి నాకొక్క పొడవైన తోక,
కట్టండి ఈ సారి ద్రుఢమైన తాడు.

నీలాల ఆ మబ్బు బుగ్గల్ని చుంబించి
ఆ కబురు నీ చెవిన సన్నంగ వదిలేస్త
ఆ ఎత్తు పవనాల నే చెసిన ఊసులు
విడమరచి విడమరచి నీ చెవిన చెప్తా.
పైనున్న ఆ పిట్ట పాటల్ని విన్నాక
ఆ రాగాల మూటల్ని నీ కడకు తెస్త.

కట్టండి కట్టండి ద్రుఢమైన తాడూ..
పెట్టండి ఈ సారి పొడవైన తోక.

మేధావులు మహనీయులు చరిత్రయన్
చిరకాలం నిలిచిన మ్రుత్యుంజయ మనుషులు
తెగిన గాలి పటం, వారి బ్రతుకులను
తెరిగెగుర వేసిరి.
మనుషుల మనసులలొ చిర కాలం నిలిచిరి.

భూ వొడిని చేరిన ఈ గాలిపటమే
రెప రెప లాడు రోజు ఇంకెంత దూరం!!
తీరు తెన్నులు లేని ఈ కవి రాజు
గగన వీధిన గర్జించు రోజు ఇంకెంత దూరం!!!!

ఢిల్లీ పట్టణం

ఢిల్లీ ఢిల్లీ మహా పట్టణం
భారతానికిది మహోత్తేజితం
హిందీ పలుకుల హస్థినాపురం
దేశ ప్రజలకిది రాజధాని నగరం.

చలి చలి రోజుల సీతా కాలం
బయ్టకి పోతే బిగుసుకు పోతాం
వేసవి వేడిమి ఉడికిస్తుంటే
కూలర్ గాలి కొంత వరకూ బెస్టే.

పార్లమెంటు, పురానీ దిల్లీ, లాల్ కిలా
మహా పట్టణం శోభలు ఎన్నో.
క్యుతుబ్, అక్షర్ధాం, ఇండియా గేట్
రాజధాని నగరం రంగులు ఇంకెన్నో!

ముఘల్ చక్రవర్తుల ముద్దు బిడ్డ ఢిల్లీ
మహా నాయకులు వెలసిన ఢిల్లీ
నెహ్రూ చాచా నడిచిన ఢిల్లీ
మనదేలేవోయ్, మనదే ఢిల్లీ.

హిందూ ముస్లిం పంజాబీలు
అన్నదమ్ములుగ మెలగే ఢిల్లీ.
దక్షిన ఉత్తర తూర్పు దేశం
ఒకటిగ వెలసిన అద్భుత నగరం.

మహా పట్టణం మఱ్ఱి నీడలో
మంచిగ బ్రతికిన ప్రాణులు ఎన్నో.
ఢిల్లీ పట్టణ దర్శన భాగ్యం
దొరకని తనువులు ఇంకెన్నో!!