Tuesday, July 31, 2007

గాలిపటం

యెడారి దారిన వంటరి నడకన,
తీగ తెగిన గాలిపటం నేను.
తీరు తెన్ను లేక, తగిన పద్ధతి లేక
వంటరిని నేను.
బాటసారిని నేను.
గాలెటు వీస్తే అటూగిపోతా
గాలి లేని వేళ నిట్టుర్చి భువికొరిగి పోతా.

భూమిని చేరితి పతంగం నేను
పెట్టండి నాకొక్క పొడవైన తోక,
కట్టండి ఈ సారి ద్రుఢమైన తాడు.

నీలాల ఆ మబ్బు బుగ్గల్ని చుంబించి
ఆ కబురు నీ చెవిన సన్నంగ వదిలేస్త
ఆ ఎత్తు పవనాల నే చెసిన ఊసులు
విడమరచి విడమరచి నీ చెవిన చెప్తా.
పైనున్న ఆ పిట్ట పాటల్ని విన్నాక
ఆ రాగాల మూటల్ని నీ కడకు తెస్త.

కట్టండి కట్టండి ద్రుఢమైన తాడూ..
పెట్టండి ఈ సారి పొడవైన తోక.

మేధావులు మహనీయులు చరిత్రయన్
చిరకాలం నిలిచిన మ్రుత్యుంజయ మనుషులు
తెగిన గాలి పటం, వారి బ్రతుకులను
తెరిగెగుర వేసిరి.
మనుషుల మనసులలొ చిర కాలం నిలిచిరి.

భూ వొడిని చేరిన ఈ గాలిపటమే
రెప రెప లాడు రోజు ఇంకెంత దూరం!!
తీరు తెన్నులు లేని ఈ కవి రాజు
గగన వీధిన గర్జించు రోజు ఇంకెంత దూరం!!!!

No comments: