Tuesday, July 31, 2007

ఢిల్లీ పట్టణం

ఢిల్లీ ఢిల్లీ మహా పట్టణం
భారతానికిది మహోత్తేజితం
హిందీ పలుకుల హస్థినాపురం
దేశ ప్రజలకిది రాజధాని నగరం.

చలి చలి రోజుల సీతా కాలం
బయ్టకి పోతే బిగుసుకు పోతాం
వేసవి వేడిమి ఉడికిస్తుంటే
కూలర్ గాలి కొంత వరకూ బెస్టే.

పార్లమెంటు, పురానీ దిల్లీ, లాల్ కిలా
మహా పట్టణం శోభలు ఎన్నో.
క్యుతుబ్, అక్షర్ధాం, ఇండియా గేట్
రాజధాని నగరం రంగులు ఇంకెన్నో!

ముఘల్ చక్రవర్తుల ముద్దు బిడ్డ ఢిల్లీ
మహా నాయకులు వెలసిన ఢిల్లీ
నెహ్రూ చాచా నడిచిన ఢిల్లీ
మనదేలేవోయ్, మనదే ఢిల్లీ.

హిందూ ముస్లిం పంజాబీలు
అన్నదమ్ములుగ మెలగే ఢిల్లీ.
దక్షిన ఉత్తర తూర్పు దేశం
ఒకటిగ వెలసిన అద్భుత నగరం.

మహా పట్టణం మఱ్ఱి నీడలో
మంచిగ బ్రతికిన ప్రాణులు ఎన్నో.
ఢిల్లీ పట్టణ దర్శన భాగ్యం
దొరకని తనువులు ఇంకెన్నో!!

No comments: